ఇంతేనోయ్ జీవితం

నచ్చిందేదో చేస్తూ పోవటం వచ్చిందేదో స్వీకరించటం నీతో వచ్చిన వాళ్లకి తలా ఇంతా పంచటం ఉన్నంతలో సంతోషంగా బ్రతికేయటం రోజూ ఏదో ప్రయత్నించటం ఏదేమైనా ఎదుర్కోవటం బాధను భారంగా భావించకపోవటం నీ బ్రతుకులో అది ఒక భాగమని అంగీకరించటం ఇప్పుడు నువ్వున్న స్థితినుండి ఇంకొంత ఉన్నతంగా మారేందుకు ఉపయోగపడే మార్గం భయాలు ఉన్నా ముందడుగు వేయటం భరోసా లేకున్నా అనుకున్నది చేయటం బంధాలలో బందీగా మారకపోవటం ఇదే కదా వీరుల లక్షణం ఏం చేస్తున్నావో అర్థం కాకపోవటం ఎంత చేసినా ఇంతేలే అనే నిరాశలో కూరుకుపోవటం నీకు నువ్వే నచ్చక పోవటం రాజీ పడుతూ రోజులు గడిపేసే వైనం ఉన్నంతలో సంతోషంగా బ్రతకాలా ఉన్నతంగా మారేందుకు ప్రయత్నించాలా ఉన్న పనులన్నీ మానుకుని నమ్మిన దానికోసం తెగించాలా ఉన్న అవకాశాన్ని వృథా చేస్తూ బ్రతుకుని నిందించాలా ఇవి నాలుగు దారులు నీ బ్రతుకుని మలుపు తిప్పే మార్గాలు ఇది నీ యుద్ధం, ఇక నీ ఇష్టం. naveenchenna.s@gmail.com

2356 232