Vennela Lesson 3 | వెన్నెల పాఠ్యభాగం 3 | 10th Class Telugu | Season 4 | Episode 47 | Srini's EDU Podcast
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల) In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana "Podali Yondonda" (పొదలి యొండొండ), "Desalanu Kommaloyya" (దెసలను కొమ్మలొయ్య) పొదలి యొండొండ దివియును భువియు దిశలుఁ బొదివికొనియుండు చీఁకటిప్రోవు వలన మిక్కుటంబగఁ గాటుక గ్రుక్కినట్టి కరవటంబన జగదండఖండ మమరె. భావం: అధికమైన చీకటి కారణంగా దిక్కులు, ఆకాశం, భూమి ఒక దానిలో ఒకటి కలిసిపోయి, బాగా కాటుక నింపిన బరిణెలాగా విశ్వమంతా నల్లగా కనిపించింది. దెసలను కొమ్మలొయ్య సతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ బేర్చు నా కస మను పేరి భూరుహము కాంతనిరంతర తారకా లస త్కుసుమ చయంబు గోయుటకొకో యనఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్. పదవిభాగం: దెసలు+ అను, కొమ్మలు, ఒయ్యన్, అతి దీర్ఘములు + ఐన, కరంబులన్, ప్రియంబు+ ఏసగగన్, ఊది, నిక్కి, రాజనీశ్వరుడు, ఉన్నతలీలన్, పేర్చున్, ఆకశము+ అను, పేరి, భూరుహము, కాంత, నిరంతర, తారకా, లసత్, కుసుమచయంబు, కోయటుకున్ + ఒకో, అనన్, ప్రాకెన్, సముత్సికా + ఆకృతిన్. ప్రతిపదార్ధము: రజనీశ్వరుడు= రాత్రికి ప్రభువైనటువంటి చంద్రుడు దెసలు+ అను = దిక్కులు అనే కొమ్మలు= కొమ్మలను ఒయ్యన్= మెల్లగా అతి దీర్ఘములు + ఐన = మిక్కిలి పొడవైన కరంబులన్= కిరణాలు అనే తన చేతులతో ప్రియంబు+ ఏసగగన్ = ఇష్టముగా ఊది= గాలిని ఊది పట్టుకుని, నిక్కి= పైకి లేచి ఉన్నతలీలన్= ఎత్తుగా పేర్చున్= విస్తరించిన ఆకశము+ అను = ఆకాశమనే పేరి= పేరుగల భూరుహము= చెట్టు యొక్క నిరంతర= ఎల్లప్పుడూ కాంత= కాంతివంతంగా లసత్= ప్రకాశిస్తున్న తారకా= నక్షత్రాలనే కుసుమచయంబు= పూల సమూహమును కోయటుకున్+ ఒకో = కోయుటకోసమా అనన్= అన్నట్లుగా సముత్సికా+ ఆకృతిన్ = మిక్కిలి ఆసక్తిగల రూపంతో ప్రాకెన్= ఆకాశంలోకి వ్యాపించాడు భావం: రాత్రికి ప్రభువైనటువంటి చంద్రుడు దిక్కులు అనే కొమ్మలను మెల్లగా మిక్కిలి పొడవైన కిరణాలు అనే తన చేతులతో ఇష్టముగా గాలిని ఊది పట్టుకుని, పైకి లేచి ఎత్తుగా విస్తరించిన ఆకాశమనే పేరుగల చెట్టు యొక్క ఎల్లప్పుడూ కాంతివంతంగా ప్రకాశిస్తున్ననక్షత్రాలనే పూల సమూహమును కోయుటకోసమా అన్నట్లుగా మిక్కిలి ఆసక్తిగల రూపంతో ఆకాశంలోకి వ్యాపించాడు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message