Vennela Lesson 2 | వెన్నెల పాఠ్యభాగం 2 | 10th Class Telugu | Season 4 | Episode 46 | Srini's EDU Podcast

Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల) In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the Errana "Suruchira Taarakaakusumashobhi" (సురుచిర తారకాకుసుమశోభి) సురుచిర తారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ న్గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్ సరసముగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం దెర యన నొప్పె సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్. పదవిభాగం: సురుచిర, తారకాకుసుమ, శోభి, నభః + అంగణభూమిన్, కాలమన్, గరువపు సూత్రధారి, జతనంబున, దిక్పతికోటి, ముందటన్, సరసముగా, నటింపగ, నిశాసతికిన్, ఎత్తిన, క్రొత్త, తోపు, పెందర, అనన్, ఒప్పెన్, సాంధ్య, నవదీధితి, పశ్చిమదిక్ + తటంబునన్. ప్రతిపదార్ధము: సురుచిర= బాగా అందంగా ప్రకాశిస్తున్న తారకాకుసుమ= నక్షత్రాలనే పూల చేత శోభి= అలంకరింపబడిన నభః+ అంగణభూమిన్ = ఆకాశమనే రంగస్థలంపై కాలమన్= కాలమనే గరువపు సూత్రధారి = గొప్ప దర్శకుని యొక్క జతనంబున= ప్రయత్నం చేత దిక్పతికోటి= దిక్పాలకుల సమూహము ముందటన్= ముందు సరసముగా= చక్కగా నటింపగ= నాట్యం చేయడానికి సిద్ధపడిన నిశాసతికిన్= రాత్రి అనే స్త్రీకి (అడ్డముగా) ఎత్తిన= నిలిపిన క్రొత్త= క్రొత్తదైనా తోపు= లేత ఎర్రని రంగుగల పెందర= పెద్ద తెర ఏమో అనన్= అన్నట్లుగా పశ్చిమదిక్+ తటంబునన్ = పడమటి తీరంలోని సాంధ్య= సాయం సంధ్యా కాలం నవదీధితి= కొత్త వెలుగుతో ఒప్పెన్= ప్రకాశించినది. భావం: బాగా అందంగా ప్రకాశిస్తున్న నక్షత్రాలనే పూల చేత అలంకరింపబడిన ఆకాశమనే రంగస్థలంపై కాలమనే గొప్ప దర్శకుని యొక్క ప్రయత్నం చేత దిక్పాలకుల సమూహము ముందు చక్కగా నాట్యం చేయడానికి సిద్ధపడిన రాత్రి అనే స్త్రీకి అడ్డముగా నిలిపిన క్రొత్తదైనా లేత ఎర్రని రంగుగల పెద్ద తెర ఏమో అన్నట్లుగా పడమటి తీరంలోని సాయం సంధ్యా కాలం కొత్త వెలుగుతో ప్రకాశించినది. (పూర్వం నాటక ప్రదర్శనల్లో ముందు సూత్రధారి ప్రవేశించేవాడు. తర్వాత తెరచాటునుండి నటి ప్రవేశించేది. ఆ సంప్రదాయాన్ని కవి ఇక్కడ చక్కగా ఆవిష్కరించాడు.) --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message

2356 232