Vennela Lesson Introduction | వెన్నెల పాఠ్యభాగం | 10th Class Telugu | Season 4 | Episode 44 | Srini's EDU Podcast
Andhra Pradesh 10th Class Telugu 4th Lesson Vennela (వెన్నెల) చదవండి - ఆలోచించి చెప్పండి. ఈ కవిత చదవండి కొండకోనల్లో నవ్వుతూ, తుళ్ళుతూ పరుగెడుతున్న సెలయేరు కాలుజారి లోయలో పడిపోయింది. అదిచూసి ఆకులు చాటుచేసుకొని, మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి. ఇదంతా చూస్తున్న సూరీడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. 1. ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది? జ. ఈ కవిత సూర్యాస్తమయం గురించి వర్ణిస్తున్నది. 2. సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడమంటే ఏమిటి? జ. సూర్యాస్తమయం అవ్వడంని కవి సూరీడు పడమటి కొండల వెనక్కి పడిపోవడం అని వర్ణించాడు. 3. సెలయేరు కొండాకోనల మీద నవ్వుతూ తుళ్ళుతూ పరుగెత్తడం అంటే మీకేమని అర్ధమయ్యింది? జ. కొండల మీద సెలయేరు జల జల శబ్దంచేసుకుంటూ పారుతూ ఉంటుంది దీనిని కవి నవ్వుతూ తుళ్ళుతూ పరుగెత్తడం అని అర్ధమయ్యింది. నేపథ్యం: హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు, ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసురనాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలిగి పోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించారు. మరియు కవి పరిచయం ఈ పాఠం కవి ఎఱ్ఱాప్రగడ (ఎఱ్ఱన) ఈ పాఠంలో నృసింహ పురాణంలోనిది ఇందులో కవి చందమామ వెలుగైన - వెన్నెలను ఎంతో రమణీయంగా వర్ణించాడు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message