Shathaka Madhurima 8| శతక మధురిమ 8 | 10th Class Telugu | Season 4 | Episode 43 | Srini's EDU Podcast
Andhra Pradesh 10th Class Telugu 6th Lesson Shataka Madhurima In this episode we will cover the Telugu poem (Telugu padyam) written by the dhurjati "Jatulsepputa Sevacheyuta " and Baddena "Varadaina Chenu Dunnaku" జాతుల్సెప్పుట, సేవచేయుట, మృషల్ సంధించుట న్యాయాప ఖ్యాతింబొందుట, కొండెగాడవుట, హింసారంభకుండౌట, మి ధ్యాతాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు నాశించి, యా శ్రీ తా నెన్ని యుగంబులుండఁగలదో శ్రీకాళహస్తీశ్వరా! - ధూర్జటి పదవిభాగం: జాతుల్+చెప్పుట, సేవచేయుట, మృషల్ సంధించుట, న్యాయ+అపఖ్యాతి+పొందుట, కొండెగాడు+అవుట, హింస+ఆరంభకుండు+అవుట, మిధ్యాతాత్పర్యములు+ఆడుట, అన్నియున్, పరద్రవ్యంబు, ఆశించి, ఆ శ్రీ, తాను, ఎన్నియుగంబులు, ఉండగలదో, శ్రీకాళహస్తీశ్వరా! ప్రతిపదార్ధము: శ్రీకాళహస్తీశ్వరా! = శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వరా జాతుల్+చెప్పుట = జాతకాలు చెప్పుట సేవచేయుట = రాజులకు సేవ చేయటం మృషల్ సంధించుట = అబద్దాలు కల్పించడం న్యాయ+అపఖ్యాతి+పొందుట = అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డపేరు పొందడం కొండెగాడు+అవుట = చాడీలు చెప్పడం హింస+ఆరంభకుండు+అవుట = హింసలు చేయడం మిధ్యాతాత్పర్యములు+ఆడుట = ఉన్నవీ, లేనివీ చెప్పడం అన్నియున్ = ఇటువంటి పనులన్నియు పరద్రవ్యంబు = ఇతరుల ధనమును ఆశించి (యేకదా) = కోరి చేయినట్టివే కదా ఆ శ్రీ = అలా సంపాదించినా ధనము తాను = తాను ఎన్నియుగంబులు = ఎన్ని యుగాలపాటు ఉండగలదో = ఉంటుందో కదా భావం: శ్రీకాళహస్తీశ్వరా! జనులు ధనాన్ని కోరి జాతకాలు చెప్పడం, రాజుల సేవలు చేయడం, అబద్దాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ, లేనివీ పలకడం - ఇన్ని పనులు చేస్తున్నారు. ఇవి అన్నీ ఇతరుల ధనాన్ని ఆశించి చేసేవే? ఆ ద్రవ్యమెన్నాళ్ళుంటుంది? తాను మాత్రం యుగాలపాటు ఉండడుగదా. అందుచేత ఈ చెడుపనులన్నీ నిరర్ధకాలు. వఱదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడ కేఁగకుమీ పరులకు మర్మము సెప్పకు పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ! - బద్దెన భావం: సుమతీ! వరద వస్తే మునిగిపోయిన పొలాన్ని దున్నవద్దు. కరువు వస్తే బంధువుల ఇండ్లకు వెళ్ళద్దు. తన రహస్యాన్ని పరాయివారికి, అంటే శత్రువులకు, చెప్పవద్దు. పిరికివానికి సేవనాయకత్వం ఇవ్వవద్దు. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/srinivas-nissankula/message