Shubhalekha Sudhakar - Talk Show - శుభలేఖ సుధాకర్ - టాక్ షో - Part 1
శ్రీ శుభలేఖ సుధాకర్ గారు తెలియని తెలుగు సినీ , టీవీ ప్రేక్షకులు ఉండరు. అత్యంత ప్రజల మన్ననలు పొందిన మహోన్నత నటులు శ్రీ శుభలేఖ శుధాకర్ గారు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన 'శుభలేఖ' చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో శుభలేఖ సుధాకర్ గా సుపరిచితులయ్యారు. శ్రీ కె.విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు.శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ గారు - బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు లాంటి విజయవంతమైన సినిమాలలోనటించారు. అద్భుతమైన నటులు మన శ్రీ శుభలేఖ సుధాకర్ గారితో - టాక్ షో. పార్ట్ -1 తప్పకుండా వినండి.