Vrishabha Rashi (Taurus Sign) 2021 Rashi Phalalu
జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబ్నడినవే మేషము, మీనము మొదలగు రాశులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు